చాట్‌జీపీటీ తరహాలోనే ఏఐ చాట్ బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే బార్డ్ పేరుతో గూగుల్, ఓపెన్ ఏఐ పేరుతో మైక్రోసాఫ్ట్ తమ చాట్ బాట్ లను తీసుకువచ్చాయి. ఈ రంగంలో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ విషయంలో కొంత ఆలస్యంగానే స్పందించింది. ఈ చాట్ బాట్‌కు ఆమెజాన్ క్యూ అనే పేరు పెట్టింది. తమ లేటెస్ట్ చాట్ బాట్ ఆమెజాన్ క్యూని 'కొత్త రకం జనరేటివ్ ఏఐ I పవర్డ్ అసిస్టెంట్' అని ఆమెజాన్ చెబుతోంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వార్షిక సమావేశం లాస్ వేగాస్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన టూల్. ఇది ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. బ్లాగ్ పోస్టులను రాయడం.. కంటెంట్ ను స్పష్టించడం వంటి పనులను ఈ అమెజాన్ క్యూ అనేది సులభతరం చేస్తుందని అమెజాన్ ధ్రువీకరించింది. వీటితో పాటు.. కంటెంట్‌ని సింథసైజ్ చేయడం, రోజువారీ కమ్యూనికేషన్‌లను క్రమబద్ధీకరించడం ,వంటి పనులలో ఉద్యోగులకు సహాయం చేయడం వంటి పనులను చేయగలదని అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం ఈ వర్షన్ అందరికీ అందుబాటులో లేదని, ప్రివ్యూ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా క్లౌండ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్న కంపెనీల జాబితాలో గూగుల్, మైక్రోసాప్ట్ కంటే కూడా అమెజాన్ ముందు ఉండడం విశేషం. దీని గురించి అమెజాన్ తన బ్లాగ్ పోస్ట్ లో వివరించింది. మీ కంపెనీ వ్యాపారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని.. డేటా, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్, రిపోజిటరీలు, కోడ్లను కనెక్ట్ చేయడం ద్వారా దీని సేవలను పొందవచ్చని ఆ పోస్ట్ లో పేర్కొంది. కంటెంట్ ను అందించడంతో పాటు.. వివిధ ఇన్ సైట్స్ ను పొందడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెజాన్ సెప్టెంబరులో ప్రకటించింది. ఈ అంకుర సంస్థను ఓపెన్‌ఏఐ మాజీ ఉద్యోగులు స్థాపించారు. అలాగే వాయిస్ అసిస్టెంట్ 'అలెక్సా'కూ అమెజాన్ ఏఐ ఆధారిత ఫీచర్లను అనుసంధానిస్తోంది.
0 Comments