Ad Code

షావోమీ ఎలక్ట్రిక్ వాహనం SU7 సెడాన్ !


షావోమీ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం SU7 సెడాన్ ఆవిష్కరించింది. ఈ ఈవీ కారు లిడార్‌తో లేదా లేకుండా రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. ఆసక్తి గల కస్టమర్‌లు రియర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ మధ్య ఎంచుకోవచ్చు. సెడాన్ మొత్తం మూడు వేరియంట్‌లలో వస్తుంది. వచ్చే డిసెంబర్ 2023లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. షావోమీ SU7 ఎలక్ట్రిక్ సెడాన్ వినియోగదారులకు రెండు పవర్‌ట్రెయిన్ మధ్య ఆప్షన్ అందిస్తుంది. రియర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ సెడాన్ రిలీజ్ తర్వాత మూడు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుంది. అందులో ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మాక్స్ ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌లో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 295బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఏడబ్ల్యూడీ వెర్షన్ 663బీహెచ్‌పీ అధిక పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఏడబ్ల్యూడీ డ్రైవ్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ ముందు 295బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారు, రియల్ యాక్సిల్‌పై 368బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది.బడ్జెట్-ఫ్రెండ్లీ లో ట్రిమ్‌లు బీవైడీ నుంచి సేకరించిన LFP బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. అయితే, పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో కూడిన ఉన్నత స్థాయి వేరియంట్‌లు సీఏటీఎల్ నుంచి ఎన్ఎమ్‌సీ బ్యాటరీ ప్యాక్‌లతో అమర్చబడి ఉంటాయి. బ్యాటరీ బరువు కారణంగా ఎలక్ట్రిక్ కార్లు భారీగా ఉంటాయి. షావోమీ SU7 బేస్ మోడల్‌ 1,980 కిలోలు టాప్-ఎండ్ ట్రిమ్ 2,205 కిలోల బరువు ఉంటుంది. లో వేరియంట్లు 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని, హై-వేరియంట్‌లు 265 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంటాయి.షావోమీ SU7 ఉత్పత్తి డిసెంబర్ 2023లో ప్రారంభం కానుంది. కొత్త సెడాన్ కార్ల డెలివరీలు ఫిబ్రవరి 2024లో ప్రారంభం కానున్నాయి. బీజింగ్ ఫ్యాక్టరీలో ఇప్పటికే ట్రయల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం ట్రయల్స్ వాహనాలు అసెంబ్లింగ్ లైన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. అప్లికేషన్ కారు వివిధ స్పెసిఫికేషన్‌లపై వివరాలను అందించింది. బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కో.లిమిటెడ్ ఈవీ కాంట్రాక్ట్ తయారీని నిర్వహిస్తుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనం గతంలో ఎమ్ఎస్S11 అనే కోడ్‌నేమ్‌తో వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu