Ad Code

త్వరలో వివో X100 సిరీస్ ఫోన్లు !


వివో X100 సిరీస్ ఫోన్లను రూ.45వేల ప్రారంభ ధరతో త్వరలో లాంచ్ చేయనుంది. గత కొన్ని వారాలుగా ఈ ఫోన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. బేస్ మోడల్ ఇటీవల ఇ-కామర్స్ పోర్టళ్లలో లిస్ట్ అయింది. దీని ధర ఎంతో కూడా తెలిసింది. ఇప్పుడు కంపెనీ వివో X100 సిరీస్ లాంచ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించింది. దీంతోపాటు వివో X100 ప్రో డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. 2022 నవంబర్‌లో చైనాలో విడుదలైన Vivo X90 లైనప్‌కు సక్సెసర్‌గా కంపెనీ కొత్త సిరీస్ ఫోన్లను తయారు చేస్తోంది. వివో X100 సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు ఉంటాయి. వీటిలో బేస్ వేరియంట్ వివో X100 కాగా, వివో X100 ప్రో, X100 Pro+ ఎడిషన్లు లాంచ్ కానున్నాయి. లేటెస్ట్ Vivo X100 సిరీస్ చైనాలో నవంబర్ 13న లాంచ్ అవుతుందని వివో కంపెనీ ప్రకటించింది. చైనా సోషల్ మీడియా పోర్టల్ Weiboలో ఈ వివరాలను వెల్లడించింది. అదే రోజు వివో వాచ్ 3ని కూడా రిలీజ్ చేయనున్నట్లు వివో చైనా వెబ్‌సైట్‌లోని మరో పోస్ట్ పేర్కొంది. ఈ వాచ్ బ్లూఓఎస్‌తో రానుంది. విబో పోస్టులో కంపెనీ అప్‌కమింగ్ 'వివో X100 ప్రో' డిజైన్‌ను సైతం టీజ్ చేసింది. ఈ ఫోన్ బ్లూ రిపుల్ గ్లాస్ ఫినిషింగ్ డిజైన్‌తో కనిపిస్తుంది. ఆకాశం, వివిధ ఖగోళ వస్తువుల ప్రేరణగా ఈ డిజైన్‌ను ఫైనల్ చేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. డివైజ్ వెనుక భాగంలో పెద్ద సర్య్కులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. మాడ్యూల్‌లో నాలుగు కెమెరాలు ఉంటాయి. LED ఫ్లాష్ యూనిట్‌ నిలువుగా కనిపిస్తుంది. గత నివేదికల ప్రకారం, Vivo X100 Pro కెమెరా సెటప్‌లో 1-ఇంచ్ సోనీ IMX989 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన శామ్‌సంగ్ JN1 సెన్సార్, 4.3x ఆప్టికల్ జూమ్‌తో ఓమ్నివిజన్ OV64B టెలిఫోటో షూటర్‌ ఉంటాయి. ప్రైమరీ సోనీ IMX920 సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌ టెలిఫోటో లెన్స్‌ మినహా బేస్ మోడల్ కూడా ఇలాంటి కెమెరాలతో రావచ్చని భావిస్తున్నారు. వివో X100 వేరియంట్ 12GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ మోడల్ ధర CNY 3,999 (దాదాపు రూ. 45,500)గా ఉండవచ్చని గత నివేదిక ఒకటి సూచించింది. సిరీస్‌లో మిగతా మోడళ్ల ధరలు ఇంతకు మించి ఉండవచ్చు. వివో X100 ఫోన్లు LPDDR5T ర్యామ్‌తో రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. బేస్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో రానున్నాయి. టాప్-ఆఫ్-లైన్ Vivo X100 Pro+ డివైజ్, లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రాసెసర్‌తో రావచ్చు.

Post a Comment

0 Comments

Close Menu