Ad Code

విండోస్‌ 10 ఓఎస్‌కు సర్వీస్‌ సపోర్టు నిలిపివేత ?


మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 ఓఎస్‌కు సర్వీస్‌ సపోర్టును 2025 అక్టోబర్‌ 14వ తేదీ నుంచి  నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 కోట్ల కంప్యూటర్లు పనికిరాకుండా పోతాయని కెనాలిస్‌ రీసెర్చ్‌ అనే సంస్థ వెల్లడించింది. కెనాలిస్‌ రీసెర్చ్‌ ప్రకారం.. ‘ విండోస్‌ 10 ఓఎస్‌కు మైక్రోసాఫ్ట్‌ సపోర్టు నిలిపివేస్తే.. మైక్రోసాఫ్ట్ నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ రావు. దీనివల్ల యూజర్లు తప్పకుండా కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం ద్వారా సుమారు 48 కోట్ల కిలోల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పోగవుతాయని నాలిస్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. అంటే ఇది 3.2 లక్షల కార్ల వ్యర్థాలతో సమానమని పేర్కొంది. అయితే ఈ వ్యర్థాల్లో హార్డ్‌ డ్రైవేలను డేటా స్టోరీజీ డివైజ్‌లుగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పింది. మిగిలిన ర్యామ్‌, మదర్‌ బోర్డుతో పాటు ఇతర విడిభాగాలను సరైన రీతిలో రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చని. అయితే సరైన రీతిలో రీసైకిల్‌ చేయకపోతే అవి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. విండోస్‌ 10 ఓఎస్‌కు సపోర్టు నిలిచిపోయినప్పటికీ మరికొన్నేండ్లు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ సేఫ్టీ అప్‌డేట్స్‌ లేని పరికరాలకు డిమాండ్‌ చాలా తక్కువగా ఉంటుందని కెనాలిస్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. విండోస్‌10 ఓఎస్‌కు సపోర్టు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ.. మైక్రోసాఫ్ట్ వద్ద మరో ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. 2028 అక్టోబర్‌ వరకు వార్షిక ఫీజు ప్రతిపాదనతో సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది. దీనివల్ల యూజర్లకు ఎంతో కొంత మేలు జరుగుతుందని.. ఈ-వేస్ట్‌ పోగవ్వకుండా మరికొద్ది సంవత్సరాలు పాత కంప్యూటర్లను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu