Ad Code

వన్‌ప్లస్ 12 విడుదల !


వన్‌ప్లస్ 12  ఫోన్‌ను అధికారికంగా లాంచ్‌ చేయబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో గ్లోబల్‌ లో లాంచ్‌ కానుంది. అయితే భారత్‌ లో ఈ ఫోన్‌లు మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అన్న విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక వన్‌ప్లస్‌ 12 లాంచింగ్‌ కంటే ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పని చేయనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 64 మెగాపిక్సెల్‌, 50 మెగాపిక్సెల్‌, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాలు అందించారు. కాగా ఇందులో 32 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.ఈ ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ను అందించారు. దీంతో దూరంలో ఉన్న సబ్జెక్ట్స్‌ను కూడా హై క్వాలిటీ ఫొటోలను తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు.

Post a Comment

0 Comments

Close Menu