Ad Code

రెడ్‌మీ 13ఆర్ 5జీ ఫోన్ విడుదల !


రెడ్‌మీ 13ఆర్ 5జీ ఫోన్ చైనాలో నిశ్శబ్దంగా లాంచ్ అయింది. ఇటీవల భారత మార్కెట్ లో లాంచ్ అయిన రెడ్‌మి 13సీ 5జీతో ఫోన్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది.. 5జీ కనెక్టివిటీతో కూడిన బడ్జెట్ ఆఫర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. రెడ్‌మి 13సీ 5జీ మోడల్ మాదిరిగానే కొత్త ఫోన్ కూడా 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ ద్వారా ఫోన్ పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14తో వస్తుంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా ఉన్నాయి. డిస్‌ప్లే ఎగువన కేంద్రీకృత వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది… ఈ ఫోన్ బరువు 192 గ్రాములు, 168ఎమ్ఎమ్x78ఎమ్ఎమ్ x 8.09ఎమ్ఎమ్ పరిమాణం ఉంటుంది. ఇంకా బోలెడు ఫీచర్స్ ఉన్నాయి.. ఇక ధర విషయానికొస్తే.. 4జీబీ + 128జీబీ వేరియంట్ స్టార్ రాక్ బ్లాక్, ఫాంటసీ పర్పుల్, వేవ్ వాటర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu