Ad Code

ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ గడువు మార్చి 14 వరకు పొడిగింపు !


చితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. కానీ తాజాగా మరోసారి ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది యూఐడీఏఐ. దీంతో వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14 వరకూ ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో గడువు పొడిగించాలని నిర్ణయించామని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించి ఆధార్ పత్రాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌ కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేళ్లుపూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్‌సైట్‌ లో అప్‌డేట్ చేసుకోవాలని గతంలో యూఐడీఏఐ సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేళ్లకు ఒకసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటర్ లోని వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu