Ad Code

ఐఫోన్ 16 సిరీస్ లో యాక్షన్ బటన్‌ !

పిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో 'యాక్షన్ బటన్' ఫీచర్ ను తీసుకొస్తుంది.  ఇప్పటికే ఐఫోన్ 15 సిరీస్ ప్రో మోడల్స్‌లో యాక్షన్ బటన్ ఫీచర్ ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో కూడా ఇదే తరహా యాక్షన్ బటన్ ఫీచర్ అందించనున్నట్టు అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లో యాక్షన్ బటన్‌ అందించడంతో ఐఫోన్ 16 సిరీస్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నివేదిక ప్రకారం.. యాక్షన్ బటన్ అనేది సాధారణ ఫోన్ బటన్ కాదు. అనేక విధాలుగా ఈ బటన్ పనిచేస్తుంది. ఐఫోన్ యూజర్లు తమకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయగల బటన్. 2021లో, ఆపిల్ ఐఫోన్ 15 ప్రో కోసం హాప్టిక్ వాల్యూమ్, పవర్ బటన్‌లతో చేర్చాలని మొదట ప్లాన్ చేసింది. అయితే, ఆ బటన్స్ ఎంపికలో కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. దాంతో యాక్షన్ బటన్ ఫీచర్‌ను ఆపిల్ నిలిపివేసింది. ఆ తర్వాత చివరిగా ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్‌లలోకి కొత్త యాక్షన్ బటన్ తీసుకొచ్చింది. ఐఫోన్‌లలో కనిపించే మునుపటి మ్యూట్ స్విచ్ మాదిరిగా కాకుండా, యాక్షన్ బటన్ మల్టీఫేస్ కలిగి ఉంటుంది. అన్ని పనులను సులభంగా ఆపరేట్ చేసేలా సెటప్ చేసి ఉంటుంది. తద్వారా వినియోగదారులకు తమ ఐఫోన్‌లపై మరింత కంట్రోల్ ఇస్తుంది. మీరు సైలెంట్ మోడ్‌కి మారడానికి, ఫ్లాష్‌లైట్‌ని ఆన్ చేయడానికి, కెమెరా యాప్‌ను వివిధ మోడ్‌లలో లాంచ్ చేయడానికి, వాయిస్ మెమోలను ఎనేబుల్ చేయడం, నిర్దిష్ట ఫోకస్ మోడ్‌లను ఆన్ చేయడం, యాక్సెసిబిలిటీ ఫీచర్‌లు, ఐఫోన్ కెమెరాను భూతద్దంలా ఉపయోగించడానికి, భాషలను త్వరగా ట్రాన్స్‌లేట్ కూడా ఈ యాక్షన్ బటన్ ఉపయోగించవచ్చు. ఐఫోన్ 16 లైనప్‌తో ఆపిల్ యాక్షన్ బటన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. పాత ఐఫోన్‌లలోని టచ్ ఐడీ హోమ్ బటన్ లేదా ఇటీవలి మ్యాక్‌బుక్స్‌లోని ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ మాదిరిగానే అందించనుంది. మెకానికల్ బటన్ నుంచి కెపాసిటివ్-టైప్ ఒకటికి మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అట్లాస్ అనే కోడ్‌నేమ్ గల కొత్త యాక్షన్ బటన్, మెరుగైన కార్యాచరణను అందించే ఫోర్స్ సెన్సార్‌తో వస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే 4 ఐఫోన్ 16 మోడల్‌లు అన్నీ యాక్షన్ బటన్‌ను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ ఏడాదిలో ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ నుంచి ఫిజికల్ మ్యూట్ స్విచ్‌ స్థానంలో యాక్షన్ బటన్ తీసుకు వచ్చింది. వచ్చే ఏడాది వనిల్లా ఐఫోన్ మోడల్‌లలో ఈ యాక్షన్ బటన్ వస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు, యాక్షన్ బటన్‌ను సాలిడ్-స్టేట్ బటన్‌గా మార్చాలని ఆపిల్ యోచిస్తోందని నివేదిక పేర్కొంది. అప్‌డేట్ చేసిన బటన్ టాక్ట్-స్విచింగ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుందని సూచిస్తోంది. అయితే ఈ ఫీచర్ ప్రత్యేకతపై క్లారిటీ లేదు. అదనంగా, ఐఫోన్ 16 లైనప్‌లో భాగంగా సెట్ చేసిన కొత్త 'క్యాప్చర్' బటన్, మెరుగైన యాక్షన్ బటన్‌తో సమానమైన మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu