యాపిల్ ఐఫోన్ యూజర్లకు సరికొత్త ఐఓఎస్ 17.2 అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కొన్ని కొత్త ఫీచర్లు ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఐఓఎస్ 17.2 అప్ డేట్ ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 వంటి అన్ని సిరీస్‌లకు అప్లై అవుతుంది. ఈ అప్‌డేట్‌లో త్రీడీ వీడియో షూటింగ్ ఫీచర్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి త్రీడీ వీడియోలు షూట్ చేయడమే కాకుండా ఆ వీడియోలను త్రీడీలో చూడొచ్చు కూడా. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. త్రీడీ విజ్యువల్ కోసం యాపిల్ 'విజన్ ప్రో హెడ్‌సెట్' వాడాల్సి ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్‌లో కొత్త జర్నల్ యాప్ ఉంటుంది. దీంతో యూజర్ల ఎప్పటికప్పుడు నచ్చిన నోట్స్‌ను రాసుకోవచ్చు. దాన్ని సీక్రెట్‌గా దాచుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌డ్రాప్, యాపిల్ మ్యూజిక్, డిజిటల్ క్లాక్, కీబోర్డ్ వంటి వాటిలో కొన్ని కీలక మార్పులు ఉండనున్నాయి. అలాగే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లోయాక్షన్ బటన్‌ను ట్రాన్స్‌లేట్ కోసం వాడుకునే వీలు కల్పించారు. అలాగే మెసేజెస్ యాప్‌లో స్టిక్కర్స్, ఎమోజీల వంటివి అప్‌డేట్ చేశారు. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని సెక్యూరిటీ అప్‌డేట్లను ఇచ్చారు. పాత బగ్స్‌ను తొలగించారు. ఈ కొత్త అప్‌డేట్‌తో పది రోజుల వాతావరణ పరిస్థితులు తెలుసుకునేలా వెదర్ యాప్ కూడా అప్‌డేట్ అయింది. కొత్త అప్‌డేట్‌ను ఇన్ స్టాల్ చేసుకోవడం కోసం 'సెట్టింగ్స్'లోకి వెళ్లి 'జనరల్'పై క్లిక్ చేసి 'సాఫ్ట్‌వేర్ అప్‌డేట్'ను ఎంచుకోవాలి. 'ఆటోమేటిక్ అప్‌డేట్స్'ను ఆన్ చేసి అక్కడ కనిపించే 'అప్‌డేట్' పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
0 Comments