Ad Code

మెయిజు 21 స్మార్ట్ ఫోన్ విడుదల

                                                             

మెయిజు 21 స్మార్ట్ ఫోన్ ను చైనాలో అధికారికంగా లాంచ్ చేశారు. ఇందులో క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ గా ఉంది. నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ54 రేటెడ్ బిల్ట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్ గా ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.39,000) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,699 యువాన్లుగానూ (మన కరెన్సీలో సుమారు రూ.43,000), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,999 యువాన్లుగానూ (మన కరెన్సీలో సుమారు రూ.45,000) నిర్ణయించారు. మెయిజు వైట్, రుయి గ్రీన్, స్మార్ట్ పర్పుల్, అన్బౌన్స్ డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్నెస్ 1100 నిట్స్ గా ఉంది. సూపర్ ఎంటచ్ డిస్ప్లే 0.075 సెకన్ల రెస్పాన్స్ రేట్ ను అందించనుంది. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, అడ్రెనో 750 జీపీయూ కూడా ఈ ప్రాసెసర్ కు పెయిర్ అయి ఉన్నాయి. ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 512 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ ఫోన్ లో ఉంది. వైఫై, నావిక్, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, ఏ-జీపీఎస్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, డిస్టెన్స్ సెన్సార్, లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, లీనియర్ మోటార్లు కూడా అందించారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 198 గ్రాములుగా ఉంది.


Post a Comment

0 Comments

Close Menu