Ad Code

ఫిబ్రవరి 27న నథింగ్ ఫోన్ (2ఎ) విడుదల ?


మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో నథింగ్ ఫోన్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (2ఎ)ని లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ‘నథింగ్ టు సీ’ అనే ఆసక్తికర శీర్షికతో ఫిబ్రవరి 26-29 వరకు బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నేపథ్యంలో ఈ ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా అనేక సరికొత్త ప్రొడక్టుల లాంచ్‌లతో టెక్ ఔత్సాహికులను ఆకర్షించనుంది. టిప్‌స్టర్ నివేదిక ప్రకారం.. నథింగ్ ఫోన్ (2ఎ) 6.7-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్‌తో 1080*2412 పిక్సెల్‌ల పూర్తి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో రావచ్చు. శాంసంగ్ ఎస్5కెఎన్9 సెన్సార్, అల్ట్రా-వైడ్ శాంసంగ్ ఎస్5కెజీఎన్9 లెన్స్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో రౌండ్ కెమెరా మాడ్యూల్‌లో అమర్చిన డ్యూయల్ కెమెరా సెన్సార్‌తో నథింగ్ ఫోన్ (2ఎ) రావచ్చని నివేదిక పేర్కొంది. ప్రాసెసర్ పరంగా నథింగ్ ఫోన్ (2ఎ) 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుందని Gizmochina రిపోర్టు పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5లో రన్ అవుతుందని అంచనా. 

Post a Comment

0 Comments

Close Menu