Ad Code

విమాన టికెట్‌ బుకింగ్‌లో నకిలీ యాప్‌తో రూ.4 లక్షల మోసం !


ముంబయికి చెందిన ఓ మహిళ దుబాయికి వెళ్లేందుకు విమాన టికెట్‌ బుక్‌ చేసుకోవాలనుకుంది. అందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేయగా ఓ ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ కనిపించింది. అది అసలైన కంపెనీ అనుకుని ఆ మహిళ అక్కడున్న నెంబరుకు ఫోన్‌ చేసింది. ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఆ కంపెనీకి తాను ప్రతినిధిని అంటూ నమ్మించాడు. టికెట్‌ బుక్‌ చేసేందుకు యాప్‌ను తన మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరాడు. అతడిని నమ్మిన ఆమె అలాగే చేసింది. తన ఫోన్‌కు వచ్చే కోడ్‌ను చెప్పాల్సింది కోరాడు. కోడ్‌ను తెలుసుకున్న వెంటనే ఆమె ఫోన్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. దీంతో క్షణాల్లో మహిళ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 4.4 లక్షలను స్వాహా చేశాడు. తన ఖాతా నుంచి డబ్బు మాయం కావడంతో తిరిగి ఆ వ్యక్తికి ఫోన్‌ చేసింది. అతను ఎంతకీ స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu