Ad Code

మహీంద్రా థార్‌ 5 డోర్‌ వాహనం !


దేశీయ మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్‌రోడ్‌ SUV మహీంద్రా థార్‌ 5 డోర్‌ తాజాగా ఈ ఆఫ్‌ రోడర్‌కు సంబంధించిన ఇంటీరియర్‌ స్పై చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల ద్వారా థార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాదిలో జూన్‌లో మహీంద్రా థార్‌ 5 డోర్‌ ఎస్‌యూవీ లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. తాజా స్పై చిత్రాల ద్వారా ఈ ఆఫ్‌రోడర్‌ ఇంటీరియర్‌ ఫీచర్లపై ఆసక్తి నెలకొంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 3-డోర్ల మహీంద్రా థార్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్‌ సిస్టమ్‌ ఉంది. స్కార్పియో మాదిరిగానే.. మహీంద్రా థార్‌ 5 డోర్‌ పెద్ద MIDని కలిగి ఉన్న కొత్త ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కూడా కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా 3 డోర్‌ మాదిరిగానే ఇందులో HVAC నియంత్రణలు, AC వెంట్‌లు, దిగువకు టోగుల్ స్విచ్‌లు, రోటరీ డయల్, ఫిజికల్ బటన్‌ల వంటి ఇతర ఫీచర్‌లను చూడవచ్చు. ముందు సీటు ప్రయాణీకుల కోసం సింగిల్-పీస్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో అమర్చడాన్ని చూడవచ్చు. ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ క్రింద ఉన్న వ్యక్తిగత AC వెంట్ల నుంచి గాలి వెనుక సీట్లకు సైతం సరఫరా అవుతుంది. అయితే రెండవ వరుస సీటు కాన్ఫిగరేషన్ గురించి స్పష్టమైన వివరాలు వెల్లడి కాలేదు. మహీంద్రా 5-డోర్‌ థార్ వెర్షన్‌లో ఇతర కార్ల మాదిరిగానే డ్యాష్‌క్యామ్ మరియు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా థార్‌ ఫ్రంట్‌ భాగం చాలా వరకు దాని సిగ్నేచర్‌ లక్షణాలనే కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వెనుక డోర్లను జోడించడం కారణంగా దాని లుక్‌ చాలా విభిన్నంగా ఉంటుంది. మహీంద్రా థార్‌ 5 డోర్‌ వెనుకవైపు డిజైన్ మరియు స్టైలింగ్ చాలా వరకు స్టాండర్డ్ థార్ లాగానే అనిపిస్తుంది. అయితే స్టాండర్డ్ థార్‌తో పోల్చితే ఇందులో వీల్‌ బేస్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆఫ్‌ రోడర్‌ కారణంగా మహీంద్రా 5-డోర్ థార్ పొడవుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది భారీ వాహనం కావడంతో ఇందులో సస్పెన్షన్ సెటప్‌లో మార్పులు ఉన్నాయి. 5-డోర్ థార్ రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ప్రవేశపెట్టనుంది. ఒకటి 130 hp, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ కాగా.. మరొకటి 150 hp, 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జతచేయబడి ఉంటాయి.


Post a Comment

0 Comments

Close Menu