యాపిల్ సొంత 6G నెట్‌వర్క్‌పై పని చేస్తుందని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన టెక్ రిపోర్టర్ మార్క్ గుర్మాన్ తెలిపారు. 6G ప్రస్తుత 5G కంటే ఫాస్టెస్ట్, రిలయబుల్ వైర్‌లెస్ కనెక్టివిటీని అందించగలదు. దీనిని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ 6G రిఫరెన్స్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించే "సెల్యులార్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్ట్" కోసం కూడా వెతుకుతోంది. వీరి కోసం రీసెంట్‌గా జాబ్ లిస్టింగ్స్ కూడా పోస్ట్ చేసింది. ఎక్స్‌టర్నల్ సప్లయర్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సొంత ప్రొడక్ట్స్‌పై మరింత నియంత్రణను పొందడానికి, లైట్నింగ్ పోర్ట్‌లు, సిలికాన్ చిప్‌సెట్‌ల వంటి సొంత టెక్నాలజీలను యాపిల్ సంస్థ డెవలప్ చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటే, కంపెనీ సొంత 6G అభివృద్ధి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే గతంలో యాపిల్ ఓన్ 5G మోడెమ్‌ను రూపొందించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఇది ఐఫోన్ మోడళ్లలో ఒక కీలకమైన భాగం. ఈ 5G మోడెమ్‌ను క్రియేట్ చేయడంలో కంపెనీ ఓన్ డెడ్‌లైన్స్ చేరుకోలేక కంప్లీట్‌గా ఫెయిల్ అయింది. ఫలితంగా 2023, సెప్టెంబరులో ప్రముఖ 5G మోడెమ్ ప్రొవైడర్ అయిన క్వాల్‌కమ్ తో డీల్ రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చింది. యాపిల్ 5G మోడెమ్ ప్రాజెక్ట్‌ను వదులుకోలేదని, కానీ నెక్స్ట్ జనరేషన్ వైర్‌లెస్ టెక్నాలజీ 6Gకి దృష్టిని మార్చిందని గుర్మాన్ చెప్పారు. కంపెనీ భవిష్యత్ ఐఫోన్‌ల కోసం క్వాల్‌కమ్‌పై ఆధారపడకుండా ఉండాలని భావిస్తోంది. వాస్తవానికి, ఈ రెండు కంపెనీలు పేటెంట్ రాయల్టీలపై చాలా కాలం పాటు తీవ్రమైన న్యాయపరమైన వివాదాన్ని ఎదుర్కొన్నాయి. మళ్లీ ఇలాంటి చిక్కులు లేకుండా సొంత వైర్‌లెస్ టెక్నాలజీ అభివృద్ధి చేసే దిశగా యాపిల్ ప్రయత్నాలను మొదలుపెట్టింది.
0 Comments