Ad Code

హానర్‌ ఎక్స్‌8బీ విడుదల !


హానర్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ ఎక్స్‌ 8బీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తొలుత సౌదీ అరేబియాలో లాంచ్‌ చేశారు. తర్వలోనే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. హానర్ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. మేజిక్‌ క్యాప్సూల్స్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. సైడ్‌ ఫేసింగ్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఫీచర్‌ను ఇచ్చారు. డ్యూయెల్​ సిమ్​, 4జీ వోల్ట్​ఈ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్​ 5.0జీ, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​.. 512జీబీ స్టోరేజ్​ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర భారత్‌లో రూ. 20 వేలుగా ఉంటుందని అంచనా. హానర్‌ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌ను మిడ్​నైట్​ బ్లాక్​, టిటానియం సిల్వర్​, గ్లామరస్​ గ్రీన్​ కలర్స్​లో అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్‌లో ఈ ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ అవుతుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Post a Comment

0 Comments

Close Menu