Ad Code

త్వరలో టెక్నో పాప్ 8 అప్ లాంచ్ ?


టెక్నో కంపెనీ త్వరలో టెక్నో పాప్ 8 అప్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్, స్టన్నింగ్ డిజైన్ తో కనిపిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లి సిరీస్ గా ఈ టెక్నో పాప్ సిరీస్ ముందు నుండే సుపరిచితమైనది. అంటే, ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టెక్నో పాప్ 8 అప్ కోసం అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుండి ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ తో అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ ద్వారా, ఈ ఫోన్ లో 4GB RAM, 4GB మెమొరీ ఫ్యూజన్ కలిపి టోటల్ 8GB ర్యామ్ ఉన్నట్లు చెబుతోంది. ఈ ఫోన్ లో 64GB అంతర్గత మెమొరీ కూడా ఉన్నట్లు వెల్లడించింది. టెక్నో పాప్ 8 అప్ ఫోన్ గ్రావిటీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కేమెరా సెటప్ మరియు సింగిల్ LED ఫ్లాష్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ సెటప్ చూడటానికి ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా ఉన్నట్లు కనిపించే చేస్తోంది. ఇది 12MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక ప్యానల్ లో క్రాస్ లైన్స్ కలిగిన విలక్షణమైన డిజైన్ తో కనిపిస్తోంది. టెక్నో పాప్ 8 అప్ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరా డిజైన్ తో కనిపిస్తోంది. దీనికి చుట్టూ నోటిఫికేషన్ బార్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu