Ad Code

ఐకూ నియో 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ల విడుదల !


ఐకూ నియో 8 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఐకూ నియో 9 సీరీస్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ రెడ్‌, వైట్‌ సోల్‌, నాటికల్‌ బ్లూ, ఫైటింగ్ బ్లాక్‌ కలర్స్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ చేశారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 26,700, 16 జీబీ ర్యామ్‌,256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 29,000, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 32,600, 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ ధర రూ. 37,200గా నిర్ణయించారు. ఐకూ నియో 9 సిరీస్‌లో భాగంగా ఐకూ నియో 9, నియో 9 ప్రో పేరుతో రెండు ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5కే రిజల్యూషన్‌, 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ను అందించారు. ఐకూ క్యూ1 చిప్‌ ప్రాసెసర్‌తో మంచి గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6కే వీసీ లిక్విడ్‌ కూలింగ్ 3డీ హీట్‌ను డిసిపేషన్‌ను అందించారు. దీంతో ఫోన్‌ హీట్‌ అవ్వదు. 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5160 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్స్‌లో డ్యూయల్ స్పీకర్‌, ఐఆర్‌ బ్లాస్టర్‌, ఎక్స్‌-యాక్సిస్‌ లైనర్‌ మోటర్‌, వైఫై-7ను అందించారు. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu