Ad Code

వాట్సాప్ లో 'సీక్రెట్ కోడ్'


వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. వాట్సాప్ ఛాట్స్‌ను లాక్ చేసేందుకు ఒక సీక్రెట్ కోడ్‌ను జనరేట్ చేయడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత. ఇక మీరు మీ వాట్సాప్ ఛాట్స్‌కు లాక్ వేసేందుకు ఈ సీక్రెట్ కోడ్‌ను వాడొచ్చు. ఇలా సీక్రెట్ కోడ్‌తో దాచిపెట్టే వాట్సాప్ ఛాట్స్‌ను మళ్లీ చూడాలంటే.. సెర్చ్ బార్‌లో ఆ సీక్రెట్ కోడ్‌ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసిన ఛాట్స్ కనిపిస్తాయి. లాక్ చేసిన వాట్సాప్ ఛాట్స్ రక్షణ కోసం అదనపు లేయర్‌గా ఈ సీక్రెట్ కోడ్ పనిచేస్తుంది. మొబైల్‌లో WhatsApp తెరవండి. ఏదైనా వాట్సాప్ ఛాట్‌ను ఎంపిక చేసి లాక్ చేయండి. అనంతరం లాక్ చేసిన ఛాట్‌లను హైడ్ చేయండి. ఇలా హైడ్ చేసిన వాట్సాప్ ఛాట్‌లలో ఒకటి లేదా కొన్ని ఎంపిక చేసి.. వాటిని యాక్సెస్ చేయడానికి ఒక సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసుకోండి. అనంతరం.. మీరు సీక్రెట్ కోడ్‌తో హైడ్ చేసిన ఛాట్‌లు వాట్సాప్ మెయిన్ ఛాట్ విండోలో కనిపించవు. దాచిన, లాక్ చేసిన వాట్సాప్ చాట్‌లను చూడాలని భావిస్తే.. సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయండి.

Post a Comment

0 Comments

Close Menu