Ad Code

డెత్ కాలిక్యులేటర్ ?


ఏఐ మనుషుల మరణాలను అంచనా వేసే స్థాయికి ఎదిగింది. సాధారణంగా ఒకరి చనిపోయే సమయాన్ని కచ్చితంగా ప్రెడిక్ట్ చేయడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని తాజాగా డెత్ కాలిక్యులేటర్ అని పిలిచే కొత్త AI టూల్ సుసాధ్యం చేసి చూపిస్తోంది. ఇది వివిధ కారకాల ఆధారంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో 78 శాతం ఖచ్చితత్వంతో అంచనా వేస్తోంది. ఫలానా వ్యక్తి ఎక్స్‌పైరీ డేట్ ఫలానా టైమ్‌ అని ఇది చెప్పగలుగుతోంది. డెత్ కాలిక్యులేటర్‌ను టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు అభివృద్ధి చేశారు, వీరు లైఫ్2వెక్ అనే అల్గారిథమ్‌ను రూపొందించడానికి చాట్‌జీపీటీ వెనుక ఉన్న టెక్నాలజీని ఉపయోగించారు. ఈ అల్గారిథమ్ ఇన్‌కమ్, ఆక్యుపేషన్, లోకేషన్, హెల్త్ హిస్టరీ వంటి డేటాను విశ్లేషిస్తుంది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఎంత కాలం మనుగడ సాధించగలరనే వివరాలను అందిస్తుంది. ఈ AI టూల్ స్టడీ వ్యక్తుల గురించి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించింది. పరిశోధనా బృందం AI మోడల్‌కు ప్రతి వ్యక్తి గురించి స్పెసిఫిక్ డేటా అందించింది. లైఫ్2వెక్ అల్గారిథమ్‌ వారికి డిజిటల్ టోకెన్లను ఇచ్చింది. అయితే 78% ఖచ్చితత్వంతో 2020 నాటికి ఎవరు మరణించారో AI మోడల్ విజయవంతంగా అంచనా వేసింది. పరిశోధకులు లైఫ్ ఈవెంట్స్‌ను లాంగ్వేజ్‌లతో పోల్చారు. లైఫ్ ట్రాజెక్టరీల ప్యాట్రన్స్‌, సీక్వెన్సెస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మెథడ్స్‌ ఉపయోగించారు. 2008 నుంచి 2020 వరకు దాదాపు 60 లక్షల మంది డానిష్ ప్రజలు, పురుషులు, స్త్రీల పెద్ద డేటాసెట్‌లో AI అల్గారిథమ్‌ను పరీక్షించారు. ఆ టెస్ట్‌లో 2016, జనవరి 1 తర్వాత జీవించి ఎవరెవరు ఉండగలిగారో అంచనా వేయగలిగారు. ఎవరెవరు బతికి ఉంటారో 78 పర్సంట్‌ యాక్యురేట్‌గా చెప్పి అల్గారిథమ్‌ బాగా పని చేసిందని తెలుసుకున్నారు. డెత్ కాలిక్యులేటర్ క్లయింట్‌ల ఆయుష్షును అంచనా వేసేందుకు తరచుగా ప్రయత్నించే జీవిత బీమా కంపెనీలకు బాగా యూజ్ అవ్వచ్చు. కానీ అందుకు అనుమతించకపోవచ్చు. అల్గారిథమ్‌ ద్వారా అంచనా వేసిన వాస్తవ మరణ తేదీలను పరిశోధకులు బయటకు వెల్లడించలేదు. ఇది అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగిస్తుందని వారు భావించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి మరణ అంచనాల గురించి ఎవరికీ తెలియజేయలేదని పరిశోధకులు చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu