హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా పలు మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని విడిభాగాల్లో లోపం ఉందని, అందుకే ఇలా బైక్స్‌ను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. హోండా కంపెనీ సీబీ 350, సీబీ 350 ఆర్ఎస్ బైక్స్‌ను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. వీటిల్లో పలు విడిభాగాల్లో లోపం ఉందని, వాటిని సరిచేయడానికి రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ రావొచ్చనే అంచనాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీని వల్ల నీళ్లు లోపలికి వెళ్లే ప్రమాదం ఉందని, తద్వారా స్విచ్ లోపల భాగం తుప్పు పట్టొచ్చని కంపెనీ వెల్లడించింది. దీని వల్ల మల్‌ఫంక్షన్ జరగొచ్చని తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2023 జనవరి వరకు తయారు అయిన యూనిట్లలో ఈ సమస్య ఉండొచ్చని కంపెనీ వివరణ ఇచ్చింది. అయితే ఎన్ని బైక్స్‌పై ఈ ప్రభావం ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. ఈ సమస్య వల్ల మాత్రమే కాదని మరో ఇబ్బంది కూడా ఉందని కంపెనీ తెలిపింది. సెన్సార్ హౌసింగ్ మౌల్డింగ్ ప్రోసీజర్‌లో కూడా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని కంపెనీ వివరణ ఇచ్చింది. సెన్సార్ బాడీ సీలింగ్‌లో గ్యాప్ రావొచ్చనే అంచనాలు ఉన్నాయని, దీని వల్ల బ్యాంక్ యాంగిల్ సెన్సార్‌లోకి వాటర్ వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. దీని వల్ల సెన్సార్ సరిగా పని చేయకపోవచ్చని పేర్కొంది. కొన్ని సందర్బాల్లో వాహనం నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ సమస్య వల్ల 2020 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు తయారైన టూవీలర్లలో ఉండొచ్చని కంపెనీ తెలిపింది. ఈ సమస్యల నేపథ్యంలో కంపెనీ రీకాల్ ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఎవరైనా ఈ మోడళ్లు వాడుతూ ఉంటే.. వెంటనే వాటిని కంపెనీ డీలర్‌షిప్ వద్దకు తీసుకువెళ్లడం ఉత్తమం. సరిగా లేని విడిభాగాలను కంపెనీ కొత్త వాటితో రిప్లేస్ చేస్తుంది. డిసెంబర్ రెండో వారం నుంచి కస్టమర్లు వారి వాహనాలను డీలర్‌షిప్స్ వద్దకు తీసుకువెళ్లొచ్చు. ఉచితంగానే విడి భాగాలను మార్చి ఇస్తారు. వెహికల్‌కు వారంటీ ఉన్నా లేకున్నా ఈ సర్వీస్ మాత్రం ఉచితంగానే పొందొచ్చు.
0 Comments