Ad Code

వాట్సాప్‌లోనూ బస్ టికెట్స్ !


ఢిల్లీ మెట్రోలో వాట్సాప్ ద్వారా టికెట్ల జారీ మే నెలలోనే మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ రవాణాశాఖ  బస్సుల్లోనూ ప్రయాణికులకు వాట్సాప్ ద్వారా టికెట్లను ఇష్యూ చేసే దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. దేశ రాజధానిలో డీటీసీ, క్లస్టర్ బస్సుల కోసం డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఢిల్లీ రవాణా శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే వాట్సాప్ ద్వారా వినియోగదారులు బుక్ చేసుకోగలిగే బస్సు టికెట్ల సంఖ్యపై పరిమితి విధిస్తారని తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా తీసుకునే టికెట్‌ను రద్దు చేయడానికి కుదరదు. వాట్సాప్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకుంటే నామమాత్రంగా కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తారు. వాట్సాప్‌లో UPI ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఎటువంటి సౌకర్య రుసుమును వసూలు చేయరు.

Post a Comment

0 Comments

Close Menu