Ad Code

పాన్ కార్డు పోతే ఎలా పొందవచ్చు ?


పాన్ కార్డును పోగొట్టుకొంటే ఆధార్ కార్డు లాగా ఆన్లైన్లో  పొందడం సాధ్యంకాదు. కొత్త వాటికి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇలా కొత్త కార్డు తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని వస్తే మొదటిసారి పాన్ కార్డుకి అప్లై చేయాలి అనుకుంటే 300 రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే పోగొట్టుకున్న తర్వాత ఏదైనా కొత్త కార్డుకి అప్లై చేయాలి అంటే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. గూగుల్ కు వెళ్లి అక్కడ రీప్రింట్ పాన్ కార్డు అని ఎంటర్ చేయాలి. దీంతో అధికారిక వెబ్సైట్ NSDL లో రీప్రింట్ పాన్ కార్డు పై క్లిక్ చేయాలి. వెబ్ సైట్లో పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ క్యాప్చకోడును ఎంటర్ చేయ్యాలి. ఆ తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మనకు పాన్ కార్డుకు సంబంధించిన మొత్తం సమాచారం కనిపిస్తుంది. ఆ వెంటనే వాటిని ధ్రువీకరించిన తర్వాత ఓటిటి క్లిక్ చేయాలి. ఆ ఓటీటి ని ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డుకి 50 రూపాయలు రుసుము చెల్లించాలి. ఇలా చెల్లించిన 7 రోజుల తర్వాత పాన్ కార్డ్ డెలివరీ అవుతుంది. ఈ విధంగా పోయినా లేదా చినిగిపోయిన కూడా కొత్త పాన్ కార్డు ని పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu