Ad Code

వాట్సాప్ లో యూజర్ నేమ్ ఫీచర్ ?


వాట్సాప్ ఫోన్ నంబర్‌తో కాకుండా యూజర్‌నేమ్‌ తో కమ్యూనికేట్ అయ్యే ఫెసిలిటీ తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం యూజర్లు యూజర్‌ నేమ్‌ల ద్వారా ఒకరినొకరు సెర్చ్ చేసుకోగల కొత్త ఫీచర్‌ పై పనిచేస్తోంది. ఈ స్పెసిఫికేషన్‌తో ఫోన్ నంబర్లపై ఆధారపడే బదులు స్పెషల్ ఐడెంటిఫైయర్‌ యూనిక్ యూజర్‌ నేమ్‌ను సెర్చ్ బార్‌లో ఎంటర్ చేసి కావలసిన వారి అకౌంట్‌తో కమ్యూనికేట్ చేయవచ్చు. వాట్సాప్ ట్రాకర్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌కి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌ 2.23.25.19లో ఈ ఫీచర్ ఉన్నట్లు కనుగొన్నది. వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం, యూజర్‌నేమ్ అని పిలిచే ఈ ఫీచర్‌ ఇప్పటికీ అభివృద్ధి దశలోనే ఉంది. యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో దీన్ని విడుదల చేయవచ్చు. యూజర్ నేమ్ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటి అన్న విషయానికొస్తే.. అప్‌కమింగ్ ఫీచర్‌తో యూజర్ల ప్రైవసీ మెరుగుపడుతుంది. ఎందుకంటే యూజర్లు పర్సనల్ ఫోన్ నంబర్‌లను షేర్ చేయకుండానే ఇతరులతో కనెక్ట్ అవ్వ గలుగుతారు. ఐడెంటిటీ, పర్సనల్ ఇన్ఫో ని రక్షించుకో గలుగుతారు. అలానే ఈ ఫీచర్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు, ఎందుకంటే వారు యూజర్ నేమ్‌ను సెటప్ చేయాలా వద్దా అనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చు. దీన్ని ఎప్పుడైనా మార్చవచ్చు లేదా తీసివేయవచ్చు. ఈ కొత్త ఆప్షన్‌తో యూజర్లు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తులను మరింత సులభంగా కనుగొనగలరు, కనెక్ట్ అవ్వగలరు, ఎందుకంటే ఫోన్ నంబర్లను అడగడానికి, ఎక్స్ఛేంజ్ చేయడానికి బదులుగా యూజర్ నేమ్స్ మాత్రమే షేర్ చేయాలి. యాప్‌లోని సెర్చ్ బార్‌ని ఉపయోగించి యూజర్లు యూజర్‌నేమ్‌ల ద్వారా ఇతర వినియోగదారుల కోసం సెర్చ్ చేయగలరు. వారితో కన్వర్జేషన్ స్టార్ట్ చేయవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu