Ad Code

మొండికేస్తున్న చాట్‌జీపీటీ ?


కృత్రిమ మేధ ఏఐ రంగంలో సంచలనాలకు చిరునామాగా మారిన చాట్‌జీపీటీ ఇప్పుడు మొండికేస్తోంది. అడిగిన దానికి సరైన సమాచారం ఇవ్వకుండా పొడి పొడిగా సమాధానమిస్తోంది. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే వేరే చోట ప్రయత్నించండి అంటోంది. ఇంకొన్ని ప్రశ్నలకు ఆన్సర్‌ ఇవ్వను' అన్న సందేశాలను కూడా పంపిస్తున్నది. దీంతో ఏఐ చాట్‌బోట్‌ వైఖరిపై పలువురు యూజర్లు మండిపడుతూ మాతృసంస్థ ఓపెన్‌ AI కి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు గత నవంబర్‌ నుంచి చాట్‌బోట్‌ను అప్‌డేట్‌ చేయలేదని, అందుకే, అలాంటి సమాధానాలు రావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu