Ad Code

మెదడును చదివే హెల్మెట్ ?


రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెబుతూ ఉంటారు. అయితే హెల్మెట్ ధరించిన సమయం లో ఇక ఎవరికైనా మెసేజ్ పంపాలి అనుకున్నప్పుడు లేదా ఇక ఫోన్ మాట్లాడాలి అనుకున్నప్పుడు వీలు ఉండదు కానీ ఇక నుంచి ఆ వీలు ఉండబోతుంది అని చెప్పాలి. వాహనదారుల మైండ్ ని చదివే హెల్మెట్ అందుబాటు లోకి రాబోతుందట!.  ఒక వ్యక్తి మెదడు లో రన్ అవుతున్న విషయాలను చదివి వాటిని ఎవరికి పంపాలో వారికి మెసేజ్ రూపం లో హెల్మెట్ పంపిస్తుందట. సిడ్నీ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు మెదడు తరంగాలను చదవగలిగే హెల్మెట్ ను అభివృద్ధి చేశారు. అయితే చదవడమే కాదు ఏఐ ద్వారా దీనిని టెక్స్ట్ గా కూడా మార్చేందుకు అవకాశం ఉంటుందట!. ఈ హెల్మెట్ ఎంతో సురక్షితమైనది, చవకైనది, సులభం గా మరోచోటుకు తీసుకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ హెల్మెట్ విషయంలో భవిష్యత్తులో 90 శాతం కచ్చితత్వం సాధించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు సైంటిస్టులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu