Ad Code

గూగుల్ కాంటాక్ట్స్​ యాప్ ఫీచర్ ​!


గూగుల్ కాంటాక్ట్స్​ యాప్ యూజర్ ఫోన్ నంబర్ ఆధారంగా, అతని కరెంట్ లొకేషన్​ను ట్రాక్​ చేసే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. మనం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతాం. లేదా ఏదైనా ఫంక్షన్​కు వెళతాం. మనతో వచ్చిన పిల్లలు లేదా పెద్దలు అప్పుడప్పుడూ తప్పిపోతూ ఉంటారు. దీనితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక  చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం కొత్త ఊరు వెళతాం లేదా సిటీకి వెళ్తాం. ఫ్రెండ్​ రూమ్​కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను/ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, వారి లొకేషన్ తెలియక ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ 'గూగుల్ కాంటాక్ట్స్​ యాప్'​ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఫోన్ నంబర్ ఉంటే చాలు, సదరు యూజర్​ కరెంట్​ లొకేషన్​ను ఈ ఫీచర్​ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్​ కాంటాక్ట్స్ యాప్​ 4.22.37.586680692 వెర్షన్​ను అప్​డేట్​ చేసుకున్న ఆండ్రాయిడ్​ యూజర్లకు ఈ నయా ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్​ ఫోన్​లోని Settings ఓపెన్ చేయాలి. Apps సెక్షన్​లోని Google Contacts ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మీకు యాప్ ఇన్ఫో కనిపిస్తుంది. దీనిలోనే గూగుల్ కాంటాక్ట్స్ యాప్​ వెర్షన్ నంబర్​ కనిపిస్తుంది. లేటెస్ట్ 4.22.37.586680692 వెర్షన్​ ఉంటే ఓకే. లేదంటే వెంటనే ఫోన్​ను అప్​డేట్​ చేసుకోండి. ఈ నయా ఫీచర్​తో మీ జీ-మెయిల్​లో, ఫోన్​ కాంటాక్ట్​ లిస్ట్​లో ఉన్నవారి కరెంట్​ లొకేషన్​ను మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు ఎవరైతో తమ లొకేషన్​ను గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు షేర్​ చేశారో, వారి కరెంట్ లొకేషన్​ను కూడా మీరు ట్రాక్ చేయగలుగుతారు. ముందుగా గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్​ను ట్యాప్ చేయాలి. వెంటనే యూజర్ ఫొటో, అతని కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. అక్కడే Google Maps. Location Sharing ఆప్షన్​ కూడా కనిపిస్తుంది. ఈ గూగుల్ మ్యాప్స్​ లింక్​ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్​ ఉన్న కరెంట్ లొకేషన్​ మీకు కనబడుతుంది. మనం సదరు యూజర్​ ఉన్న లొకేషన్​కు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ అతను/ ఆమె ఉన్న డైరెక్షన్​ను కూడా చూపిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu