Ad Code

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ !


ఇన్ స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీ కోసం మెటా యాక్టివిటీ ఆఫ్  ఫీచర్ ను ప్రారంభించింది.  వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా ఇతర వెబ్సైట్ లేదా యాప్ ద్వారా సేకరించే ప్రక్రియను బ్లాక్ చేయవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు, సమాచారాన్ని అందించడానికి కంపెనీలు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇందులో కుకీల సహాయంతో వినియోగదారుల సెర్చ్ హిస్టరీ ట్రాక్ అవుతుంది. వారికి ఏం ఇష్టమో కూడ తెలుస్తుంది. ఇప్పటివరకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వినియోగదారులకు తెలియకుండా డేటా తీసుకుంటున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇన్స్టాగ్రామ్ నుంచి వినియోగదారుల యొక్క ఏదైనా సమాచారం తీసుకోవాలంటే, మొదట యూజర్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వినియోగదారులు కోరుకుంటే వారు డేటాను సేకరించే యాప్లు, వెబ్సైట్లను కూడా బ్లాక్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu