Ad Code

వాట్సాప్‌ స్టేటస్‌ ను కంప్యూటర్ లో అప్‌డేట్‌ చేసుకొనే అవకాశం ?


వాట్సాప్‌ వెబ్‌ వర్షన్‌ నుంచి కూడా వాట్సాప్‌ స్టేటస్‌ ను అప్‌డేట్‌ చేసుకునేలా ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకురాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌  టెస్టింగ్‌ దశలో ఉన్నది. ప్రస్తుతం కేవలం మొబైల్‌లోనే స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది. త్వరలోనే కంప్యూటర్ లో అప్డేట్ చేసుకొనే అవకాశాన్ని అందిస్తుంది.. వాట్సాప్ యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్‌ చేసుకునే వీలుంటుంది. స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ ను షేర్‌ చేసే అవకాశం వాట్సాప్‌ కల్పిస్తోంది. ఫీచర్‌ సహాయంతో వెబ్ వెర్షన్‌ లేదంటే.. లింక్‌ చేయబడిన కంపానియన్‌ నుంచి స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ను అందుబాటులో ఉందని తెలుస్తుంది. ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కలుగనున్నది. స్టేటస్‌ అప్‌డేట్‌ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది.. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి రానుంది.. ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్ కు సంతృప్తిని ఇచ్చాయని తెలుస్తుంది.. ఇక ముందు ఇంకా మరెన్నో ప్రైవసీ ఫీచర్స్ ను తీసుకురావాలనే యోచనలో వాట్సాప్ ఉంది.

Post a Comment

0 Comments

Close Menu