ఆనంద్ మహీంద్రా తాజాగా వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఇద్దరు వ్యక్తులు సోఫాలో ప్రయాణించడం చూడవచ్చు. ఈ సంఘటన చూసిన వెంటనే ఒక్క నిమిషం ఇదెలా సాధ్యమని చాలామంది షాక్ అవుతారు. ఇదెలా తయారైందో వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. నిజానికి ఒక సోఫాను ఆన్‌లైన్ సోఫాను ఆర్డర్ చేసిన దానికి చక్రాలు, మోటార్ వంటి భాగాలను, దానిని కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండింగ్ కూడా అమర్చారు. ఇది రోడ్దుపైన ప్రయాణించడానికి అనుకూలంగా ఉంది. ఈ వీడియోలో సోఫా ద్వారా రోడ్డుపైన ప్రయాణించే ఇద్దరి యువకులను చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇది కేవలం ఓ సరదా ప్రాజెక్టు మాత్రమే.. అయితే ఇందులో ఆ యువకుల అభిరుచి, ప్రయత్నం తప్పకుండా ప్రశంసనీయం. ఒక దేశం ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కొత్త ఆవిష్కరణలు ఎంతైనా అవసరం' అంటూ ఈ వెహికల్ చూస్తే RTO ఇన్స్‌పెక్టర్ ఎలా ఫీలవుతాడో చూడాలనుకుంటున్నా అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.. వేలమంది వీక్షించిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇలాంటి వీడియో 42 సంవత్సరాల క్రితమే వచ్చిందని దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు.
0 Comments