Ad Code

వారంటీ - గ్యారెంటీ మధ్య తేడా ?


వారంటీ, గ్యారెంటీ రెండు ఒకటేనని చాలా మంది భ్రమపడుతుంటారు. కానీ, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అయితే ఈ రెండు పదాల అర్థం, వాటి మధ్య తేడా ఉంది.  ఏదైనా ప్రొడక్ట్ ని కొనుగోలుచేసినప్పుడు దానికి గ్యారెంటీ ఉంటే కంపెనీ తన ఉత్పత్తి నాణ్యతకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఆ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన వస్తువులో చిన్న లోపం ఉన్నా దాన్ని రిపేర్ చేసేందుకు మెకానిక్ ను పంపుతారు. ఒకవేళ ఆ వస్తువులో పెద్ద లోపం ఉన్నట్లయితే ఆ ప్రొడక్ట్ ని వెనక్కి తీసుకొని, మరో కొత్త ప్రొడక్ట్ ని వినియోగదారులకు అందజేస్తారు. కొనుగోలు చేసిన వస్తువు వారంటీ వ్యవధిలో ఉంటే దెబ్బతిన్న వస్తువు ఉచితంగా రిపేర్ చేయబడుతుంది. వారంటీ కింద మీ వస్తువు భర్తీ చేయబడదు, కానీ మరమ్మత్తు చేయబడింది. ఈ సదుపాయం ప్రయోజనాన్ని పొందేందుకు, వస్తువుల బిల్లు, వారంటీ కార్డును తీసుకెళ్లాలి. ఇవి లేకుండా దుకాణదారుడు మరమ్మతును తిరస్కరించవచ్చు. కొనుగోలు చేసిన ప్రొడక్ట్ ని పూర్తిగా వెనక్కి తీసుకోవడం వల్ల సదరు కంపెనీకి ఎక్కువగా నష్టం ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో చాలా కంపెనీలు గ్యారెంటీకి బదులుగా వారెంటీని మాత్రమే కస్టమర్లకు అందజేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu