వాట్సాప్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ ని అప్‌డేట్ చేసుకోవాలి. అప్లికేషన్ అప్‌డేటెడ్‌గా ఉందో లేదో చెక్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ వెళ్లొచ్చు. అప్‌డేట్ చేసుకున్నాక వాట్సాప్ ఓపెన్ చేసి ఏదైనా చాట్‌పై క్లిక్ చేయాలి. చాట్ విండో కింద, టెక్స్ట్ ఇన్‌పుట్ సమీపంలో కనిపించే ఎమోజీ ఐకాన్ > స్టిక్కర్ ఐకాన్‌పై నొక్కాలి. స్టిక్కర్ మెనూలో, అందుబాటులో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌లను చూసేందుకు '+' ఐకాన్‌పై క్లిక్ చేయాలి. 'The Archies on Netflix' పేరుతో స్టిక్కర్ ప్యాక్‌ని సెర్చ్ చేసి, డౌన్‌లోడ్ చేయాలి. దానిని స్టిక్కర్ కలెక్షన్‌కు యాడ్ చేయాలి. ఇవి ఫాలో కావడం కుదరదనుకుంటే సింపుల్‌గా ఈ లింక్‌పై https://wa.me/stickerpack/TheArchiesOnNetflix క్లిక్ చేసి నేరుగా ఆర్చీస్ స్టిక్కర్స్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి, స్టిక్కర్‌ని పంపాలనుకుంటున్న చాట్‌కి వెళ్లాలి. స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేసి, స్టిక్కర్ సెలక్షన్ మెనూ ఓపెన్ చేయాలి. ఆర్చీస్ స్టిక్కర్ ప్యాక్ సెర్చ్ చేయాలి. ఇది సాధారణంగా స్టిక్కర్ మెనూ కింద ఉన్న స్టార్ ఐకాన్ పక్కన కనిపిస్తుంది. అలాగే స్టిక్కర్స్ కలెక్షన్‌లో కూడా కనిపిస్తుంది. ఆర్చీస్ ప్యాక్ నుంచి కావలసిన స్టిక్కర్‌ని ఎంచుకుని, సెండ్ చేయవచ్చు.
0 Comments