Ad Code

కళ్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా కీలక మార్పులు !


వాట్సాప్‌ వెబ్‌ యూజర్లను మెరుగైన అనుభూతిని అందించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా తక్కువ కాంతిలోనూ ఎంతో సౌకర్యవంతంగా వాట్సాప్‌ను వినియోగించుకొనేందుకు వీలుంటుందని పేర్కొంది. ఫలితంగా కళ్లపై ఒత్తిడి తగ్గుతుందని తెలిసింది. దీంతోపాటు వాట్సాప్‌ వెబ్‌ సైడ్‌బార్‌, మెసెజ్‌ క్వాలిటీని అప్‌గ్రేడ్‌ చేస్తోంది. వాట్సాప్‌ సైడ్‌బార్‌ రీడిజైన్ కొనసాగుతున్నందున ప్రస్తుతం ప్రత్యేక బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ను ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ మార్పులతో వాట్సాప్‌ ఇంటర్‌ఫేస్‌ మరింత మెరుగ్గా కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే దీని ప్రధాన ఉద్దేశం తక్కువ కాంతిలోనూ కళ్లపై ఒత్తిడి ఉండేలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల అంచనాలను అనుగుణంగా రంగుల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇందులో టార్క్‌ థీమ్‌, కిందన ఉన్న నావిగేషన్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త బ్యాక్‌గ్రౌండ్‌ అభివృద్ధి జరుగుతోందని సమాచారం. ఈ మార్పులు అన్ని అందుబాటులోకి వాట్సాప్‌ ఇంటర్‌ఫేస్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని తెలుస్తోంది. వాట్సాప్‌ స్టేటస్ అప్‌డేట్స్‌ కోసం కొత్త లేఅవుట్‌ను టెస్టింగ్‌ చేస్తోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్‌ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది. వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్స్‌లో మరో రెండు అదనపు బటన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరా, పెన్సిల్‌ ఐకాన్లు ఉండనున్నాయి. వీటి ద్వారా ఫొటో, వీడియో సహా ఇతర టెక్ట్స్‌లను స్టేటస్‌ అప్‌డేట్లుగా షేర్‌ చేసేందుకు వీలుంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ వాట్సాప్‌ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలుస్తోంది. గతంలో వాట్సాప్‌ రెండు ఫ్లోటింగ్‌ యాక్షన్‌ బటన్లను కలిగి ఉండేది. వీటి ద్వారా స్టేటస్‌లో కంటెంట్‌ను షేర్‌ చేసుకొనే వీలుంటుంది. అనంతరం ఛానల్‌ ట్యాబ్‌ను అప్‌డేట్‌ ట్యాబ్‌లో మెర్జింగ్‌ చేశారు. మరియు కెమెరా, పెన్సిల్‌ ఐకాన్‌లను స్టేటస్‌ అప్‌డేట్స్‌లో ఇంటిగ్రేట్‌ చేసింది. అయితే వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu