Ad Code

పని కంటే జీవితం ఎంతో గొప్పది !


మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ వారాంతపు సెలవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సంస్థలో పని చేసే మొదట్లో వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదన్నారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ స్వయంగా తన బ్లాగ్‌లో రాశారు. పని కంటే జీవితం గొప్పదని, విలువైందని గ్రహించానని పేర్కొన్నారు. తన పిల్లల వయస్సులో తాను ఉన్నప్పుడు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రినయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పని - జీవితం సమ తుల్యతపై బిల్ గేట్స్ మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం కాదు. ఈ ఏడాది మొదట్లో అరిజోనా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పని కంటే జీవితం ఎంతో గొప్పదని, కానీ, ఆ సంగతి తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందని బిల్ గేట్స్ చెప్పారు. మీరు మీ బృందాలను బల పర్చుకోవడానికి, మీరు సాధించిన విజయాలను షేర్ చేసుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత టైం వెచ్చించండి` అని విద్యార్థులకు సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu