Ad Code

'ఎక్స్‌'లో కొత్త చాట్‌బాట్‌ !


లన్ మస్క్ ఎక్స్‌లో 'గ్రోక్ ఏఐ' అనే చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ చాట్‌బాట్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏఐ చాట్‌బాట్‌ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్స్ హోమ్‌పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే భారత్‌లో సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1300 కాగా, వెబ్ వెర్షన్‌కు ఏడాదికి రూ.13,600గా ఉంది. చాట్‌జీపీటీ కంటే ఎక్స్‌ ప్రవేశపెట్టిన గ్రోక్‌ఏఐ చాట్‌బాట్‌ కొంత ఖరీదుగా ఉందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu