Ad Code

సింపుల్ డాట్ వన్ స్కూటర్‌ విడుదల


లక్ట్రిక్‌ టూ వీలర్‌ కంపెనీ సింపుల్ ఎనర్జీ నుంచి మరో కొత్త స్కూటర్‌ నేడు విడుదలైంది. గత మేలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు రూ. 99,999 ఎక్స్-షోరూమ్ ధరతో సింపుల్ డాట్ వన్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ డెలివరీలు ముందుగా బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత దేశంలోని ఇతర నగరాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. కాగా కంపెనీ ప్రకటించిన రూ. 99,999 ధర ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జనవరి 2024 లో సింపుల్‌ డాట్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొత్త ధరను సంస్థ ప్రకటిస్తుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు. స్కూటర్‌ డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. సింపుల్‌ ఎనర్జీ ఈ స్కూటర్‌ను బ్రజెన్ బ్లాక్, గ్రే వైట్‌తో సహా 4 కలర్‌ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. సింపుల్ డాట్ వన్ ఇ-స్కూటర్ కూడా సింపుల్ వన్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. కాగా ఈ స్కూటర్‌ గరిష్ఠంగా 160 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ స్కూటర్‌ పూర్తి ఛార్జ్‌పై 151 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లతో ముందు మరియు వెనుక 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. ఇంకా CBS, భద్రత కోసం డిస్క్ బ్రేక్ ఎంపికను చూడవచ్చు. ఇందులో 35-లీటర్ కెపాసిటీ అండర్-సీట్ స్టోరేజీ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, OTA అప్‌డేట్‌లతో కూడిన Android OS వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు, గరిష్ఠ రేంజ్‌తో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu