Ad Code

శీతాకాలంలో ఫ్రిడ్జ్ నిర్వహణ !


రిఫ్రిజిరేటర్ ను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా టెంపరేచర్ ను ఉంచాలి. అయితే కొన్నిసార్లు ఈ విషయాన్ని సైతం ప్రజలు మర్చిపోతూ ఉంటారు. నిజానికి బయట వాతావరణం మార్పుతో ఫ్రిడ్జ్ లోని ఉష్ణోగ్రత కూడా మారుతూ ఉంటుంది. దీని కారణంగానే ఆహార పదార్థాలు కూడా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత సరిగ్గా సెట్ చేయకపోతే నిల్వ చేసిన ఆహార పదార్థాలు చెడిపోవడానికి కారణాలు అవుతాయి. ప్రస్తుతం అధునాతన రిఫ్రిజిరేటర్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో సీజన్ల వారీగా గుర్తులను ఫ్రిడ్జ్ కంపెనీల సైతం ఇస్తూ ఉంటాయి .  ఫ్రిజ్ లో అలాంటి మోడ్ లేదా మార్కింగ్ లేకపోతే శీతాకాలంలో ఫ్రిడ్జ్ ని ఎలాంటి ఉష్ణోగ్రతలో ఉంచాలని విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలం లో రిఫ్రిజిరేటర్ ను 1.7 నుంచి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూడాలి. దీని వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం పాడవకుండా ఉండడమే కాకుండా విద్యుత్ వినియోగం ఆదా అవుతుంది. ఇలా ఏ కాలంలో అయితే ఆ కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను బట్టి రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ ని మార్చుకుంటూ ఉండటం వల్ల ఫ్రిడ్జ్ జీవిత  కాలం పెంచవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu