Ad Code

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్‌ !


ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్‌ లూయిస్ విట్టన్ అనే కంపెనీ ఈ ఏడాది మార్చిలో హారిజన్ లైటప్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసి అభిమానులను విస్మయానికి గురి చేసింది. వీటి ధర అక్షరాలా 1,660 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.38 లక్షలు. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఈ సొగసైన ఇయర్‌బడ్‌ల ధర సోషల్ మీడియాలో వైరల్‌ మారి వీటికి క్రేజ్‌ను పెంచాయి. మతిపోగొట్టే ధరతోపాటు క్రేజీ ఫీచర్లు వీటి సొంతం. బ్రాండ్ ఐకానిక్ మోనోగ్రామ్ ప్యాట్రన్‌తో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఇయర్‌బడ్‌లను రూపొందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎలిమినేటింగ్ మైక్రోఫోన్, బ్లూటూత్ మల్టీపాయింట్ వంటివి వీటి ప్రత్యేకతలు. ఐదు రంగులలో లభ్యమయ్యే ఈ ఇయర్‌బడ్స్‌కు 28 గంటల బ్యాటరీ లైఫ్, గ్రేడియంట్‌ రంగులతో ప్రకాశించే సొగసైన స్టెయిన్‌లెస్ స్టీల్ ఛార్జింగ్ కేస్‌ దీని ప్రత్యేకత. 

Post a Comment

0 Comments

Close Menu