Ad Code

యమహా నుంచి స్పోర్ట్స్ బైకులు విడుదల !


మహా మోటార్ ఇండియా Yamaha YZF-R3, Yamaha MT-03 అనే రెండు స్పోర్ట్స్ బైక్‌లను లాంచ్ చేసింది.ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా అకౌంట్లలో ప్రకటించింది. 2023 యమహా ఆర్3 అండ్ ఎంటీ -03 మోడల్స్ ధరలు రూ. 4.6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ఆర్3 మోడల్ కొంత విరామం తర్వాత భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఎంటీ-03 మోడల్ మాత్రం తొలిసారిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్నాయి. యమహా ఆర్3 ధర రూ. 4.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, యమహా ఎంటీ-03 ధర రూ. 4.65 లక్షల (ఎక్స్-షోరూమ్)తో వస్తుంది. 2023 యమహా ఆర్3, యమహా ఎంటీ-03కు పవర్ అందించే 321సీసీ లిక్విడ్-కూల్డ్ 4-స్ట్రోన్, ఇన్‌లైన్ టూ-సిలిండర్ మోటార్ కలిగి ఉన్నాయి. 42బీహెచ్‌పీ, 29.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లు తేలికపాటి డైమండ్ ఫ్రేమ్‌తో వచ్చాయి. యూఎస్‌డీ, మోనోక్రాస్ వెనుక సస్పెన్షన్ మధ్య సస్పెండ్, ముందువైపు 130ఎమ్ఎమ్ ప్రయాణాన్ని, వెనుకవైపు 125ఎమ్ఎమ్ ప్రయాణాన్ని అందిస్తాయి. 2023 యమహా ఆర్3 ట్రాక్ ఓరియెంటెడ్, దాదాపు 50/50 ముందు, వెనుక బరువు కలిగి ఉంటుంది. హ్యాండిల్‌బార్ క్రౌన్ అల్యూమినియంతో తయారైంది. అయితే, ఏరోడైనమిక్స్ మోటార్‌సైకిల్ పర్పార్మెన్స్ మరింత మెరుగుపరుస్తుంది. యమహా ఆర్3 ఐకాన్ బ్లూ, యమహా బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. అలాగే, ఎంటీ-03 కూడా మిడ్‌నైట్ సియాన్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్ల ధరలు ఒకే విధంగా ఉంటాయి. ఆసక్తి గల కస్టమర్‌లు తమ మోటార్‌సైకిళ్లను యమహా అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu