Ad Code

హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్ !


హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్లపై రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా అనేక కార్ల మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బోనస్‌లు ఉన్నాయి. హ్యుందాయ్ కార్లలో గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, వెర్నా, అల్కాజర్, టక్సన్, కోనా ఎలక్ట్రిక్ వంటి మోడళ్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో మోడల్ వారీగా సంవత్సరాంతపు ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ – రూ. 48,000, హ్యుందాయ్ ఆరా – రూ. 33,000, హ్యుందాయ్ ఐ20 – రూ. 20,000, హ్యుందాయ్ వెర్నా – రూ. 45,000, హ్యుందాయ్ అల్కాజర్ – రూ. 35,000, హ్యుందాయ్ టక్సన్ – రూ. 1.50 లక్షలు, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ – రూ. 3 లక్షలు ఎక్స్‌టర్, వెన్యూ, క్రెటా వంటి కంపెనీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీలపై ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. హ్యుందాయ్ 2023లో క్యాలెండర్ ఇయర్ (సివై)లో హిస్టరీలోనే మొదటిసారిగా దేశీయ మార్కెట్లో 6 లక్షల యూనిట్ల వాల్యూమ్‌ను దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో కంపెనీ ఇప్పటికే 5,59,361 యూనిట్లను విక్రయించింది. కంపెనీకి మునుపటి అత్యుత్తమ వార్షిక దేశీయ పరిమాణం 2022లో 552,511 యూనిట్లుగా ఉంది. అయితే, వచ్చే జనవరి 16, 2024న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది. హ్యుందాయ్ పాత ఐ20, ఐ20 ఎన్ లైన్ (ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు), కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. పాత ఐ20 డీసీటీ వేరియంట్‌లపై రూ. 30వేల క్యాష్ డిస్కౌంట్ పొందగా, స్పోర్ట్జ్ మాన్యువల్ ట్రిమ్ రూ. 25వేల క్యాష్ డిస్కౌంట్ కలిగి ఉంది. మిగిలిన వేరియంట్‌లకు రూ. 10వేల తగ్గింపు లభిస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu