Ad Code

అత్యధిక జీత భత్యాలు అందుకున్న సీఈఓలు !


త్యధిక జీత భత్యాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు. ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం. అతి పెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ 182 మిలియన్ డాలర్లు. అమెరికన్ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్. ఆ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు. అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు. గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎంఎన్సీ కం టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు.

Post a Comment

0 Comments

Close Menu