శాంసంగ్ క్రిస్మస్ సందర్భంగా తన M సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M34 5G, శాంసంగ్ గెలాక్సీ M14 5G పై తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. ఈ క్రిస్మస్ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.14999కి కొనుగోలు చేయవచ్చు. అదే శాంసంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.10490కే సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ M14 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరాతో సహా 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇది నాణ్యమైన ఫొటోగ్రఫీకి సాయం చేస్తుంది. దాంతోపాటు ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు M14 స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. LED ప్లాష్ లైట్లను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ M14 స్మార్ట్‌ఫోన్ 5nm Exynos 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 2వ తరం OS అప్‌గ్రేడ్‌లతోపాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 పైన పనిచేస్తుంది. మరియు Mali-G68 MP2ను కలిగి ఉంటుంది. మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంది. నేవి బ్లూ, లైట్ బ్లూ, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా ఫాస్ట్ Exynos 1280- 5nm ప్రాసెసర్‌తో వస్తుంది. M34 స్మా్ర్ట్‌ఫోన్ OS అప్‌గ్రేడ్‌లు సహా 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్‌తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.
0 Comments