ఐఐఎం నాగపూర్‌లో నిర్వహిస్తున్న జీరో మైల్ సంవాద్‌లో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని మాట్లాడుతూ భారత్‌లో ఆ కార్లను ప్రవేశపెట్టడం కానీ ప్రారంభించడం కానీ జరగదన్నారు. రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్‌లో విస్తృతమైన నెట్‌వర్క్ కారణంగా వాణిజ్య రంగంలో డ్రైవర్లకు ఉపాధి కల్పనలో భారత్ ముందుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల ఉద్యోగాలు, వారి జీవనోపాధికి భద్రత కల్పించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. అందుకే డ్రైవర్ లేని కార్లను దేశంలో ప్రవేశపెట్టే అవకాశం లేదన్నారు. డ్రైవర్ లేని కార్ల ఆవిర్భావం ఆ వృత్తిపై ఆధారపడిన వారికి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆటో రంగంలో విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, జాతీయ రహదారుల విస్తరణపై మాట్లాడారు. "మేక్-ఇన్-ఇండియా" చొరవను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ నాయకత్వంలో ఆటోమోటివ్, రవాణా రంగాల్లో.. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కొన్ని ప్రయాణీకుల కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లను తప్పనిసరి చేసింది. అంతే కాకుండా హైవేలపై టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించేందుకు.. టోల్ వసూలు కోసం ఫాస్టాగ్‌ని అమలుచేసింది.
0 Comments