వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వన్-టైమ్ లిసెన్ వాయిస్ మెసేజ్ ఫీచర్. అంటే ప్రస్తుతం మీరు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు పంపుతున్నట్టే ఇక నుంచి వాయిస్ మెసేజ్‌లను కూడా ఒక్కటేసారి వినేలా ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దారు. మీరు పంపాలనుకున్న సున్నితమైన సమాచారాన్ని వన్-టైమ్ లిసెన్ వాయిస్ మెసేజ్ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో ఎటువంటి భయం లేకుండా పంపుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల.. మీరు పంపే వాయిస్ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్ లేదా షేర్ చేయడం, సేవ్ చేసుకోవడం, స్టార్ చేయడం, రికార్డ్ చేయడం కుదరదు. తద్వారా ఈ పైవాటిలో దేని ద్వారా కూడా మీరు భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడదు.
ముందుగా మీ వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయండి. మైక్రోఫోన్ లేదా మైక్ సింబల్‌ను సెలెక్ట్ చేసుకోండి. దానిని పైకి స్వైప్ చేయండి. ఇది మీ రికార్డింగ్‌ను లాక్ చేస్తుంది. తర్వాత రికార్డ్ బటన్‌ను ప్రెస్ చేసి, చెప్పాలనుకున్న విషయం చెప్పండి. మీరు నొక్కిన బటన్ గ్రీన్ కలర్లో మారే వరకు వేచి ఉండండి. ఇది 'వ్యూ వన్స్' మోడ్‌ను సూచిస్తుంది. ఇప్పుడు సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి. ఒకవేళ అవతలి వ్యక్తి రీడ్ మెసేజెస్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే గనుకు అతడు మీరు వన్-టైమ్ వ్యూ ఫీచర్‌ను ఉపయోగించి పంపిన వాయిస్ మెసేజ్‌ను అతడు చూశాడా లేదా అనే విషయం మీకు అర్థం అవుతుంది.
0 Comments