Ad Code

వాట్సాప్‌లో రిప్లై బార్ ?


వాట్సాప్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోని రిప్లయ్ బాక్స్ మాదిరిగా రిప్లై బార్ అనే కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‌ కింద కనిపించే రిప్లై బటన్ ప్లేస్‌లో కొత్త డిజైన్‌తో ఈ బార్ ఉండనుంది. దీంతో ఏ స్టేటస్‌కైనా ఇన్‌స్టంట్‌గా రిప్లై లేదా రియాక్షన్లు జోడించే వీలుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా యాప్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌కు అందుబాటులోకి వస్తుంది. ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ 'వ్యూ వన్స్' వాయిస్ మెసేజ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఒకప్పుడు ఈ ఫీచర్ కేవలం ఫొటో, వీడియోలకే సపోర్ట్ చేసేది. ఇప్పుడు వాయిస్ మెసేజ్‌లకు కూడా అప్లై అవ్వనుంది. వాయిస్‌ నోట్స్‌ను ఒకేసారి వినేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్ పనికొస్తుంది. వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్‌ని ఒకసారి ఓపెన్ చేస్తే.. మెసేజ్ విన్న తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. వీటితోపాటు రీసెంట్‌గా వాట్సాప్.. స్టేటస్ అప్‌డేట్స్‌ను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫీచర్‌ను ప్రకటించింది. ఒకే పోస్ట్‌ను సింగిల్ ట్యాప్‌తో రెండు యాప్స్‌లో షేర్ చేసేలా ఈ ఫీచర్ ఉండనుంది. అలాగే 'కనెక్షన్ హెల్త్ ఇన్ వీడియో కాల్స్' అనే మరో కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu