Ad Code

వాట్సాప్ లో 'హైడ్ లాక్ ఫోల్డర్' ఫీచర్ !


వాట్సాప్ లో చాట్ లాక్ చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించిన లిస్ట్ పైన ఒక ఫోల్డర్ లో కనిపిస్తుంది. అందులో లాక్ చేయబడిన చాట్ లు ఉంటాయి. ఇక్కడ మీరు కొన్ని చాట్లను లాక్ చేశారని ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ సమస్యకు ముగింపు పలకడానికి కొంత కాలం తర్వాత వాట్సాప్ మరో కొత్త ఫీచర్ 'హైడ్ లాక్ ఫోల్డర్'ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ చాట్ ను లాక్ చేయడానికి ముందుగా యాప్ కి వెళ్లి ఎవరి చాట్ ను లాక్ చేయాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్ కు వెళ్లండి. ప్రొఫైల్ లోపలికి వెళ్లిన తర్వాత మీకు చాట్ లాక్ ఆప్షన్ వస్తుంది. దీన్ని ఆన్ చేసిన వెంటనే, మీ చాట్ ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ అవుతుంది. అక్కడ నుంచి ప్రత్యేక ఫోల్డర్ కి వెళుతుంది. చాట్ లాక్ అయిన తర్వాత మీరు 'లాక్డ్ ఫోల్డర్'పై క్లిక్ చేయవచ్చు. మీరు ఇక్కడకు వెళితే మీకు పైభాగంలో కుడి వైపు మూడు చుక్కలు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాక్ చేసిన చాట్ ను హైడ్ చేయడం అనే ఆప్షన్ ను పొందుతారు. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ కు భిన్నంగా ఉండే పాస్వర్డ్ ను నమోదు చేయాలి. తద్వారా ప్రైవసీ మెయింటెయిన్ అవుతుంది. పాస్వర్డ్ ని సెట్ చేసిన తర్వాత మీరు లాక్ చేసిన చాట్లు అదృశ్యం అవుతాయి. లాక్ చేసిన చాట్లను యాక్సెస్ చేయడానికి యాప్ సెర్చ్ బార్ లో సెట్ చేసిన పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ ను ఎంటర్ చేసిన వెంటనే, లాక్ చేసిన ఛాట్ల ఫోల్డర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో కేవలం మీరు మాత్రమే మీ చాట్లను చూడవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu