Ad Code

సింధులోయ నాగరికత అంతానికి భారీ క్రేటరే కారణమా ?


గుజరాత్‌ కచ్‌లోని భారీ క్రేటర్‌ ఉల్క ఢీకొట్టడంతో వల్లే ఏర్పడిందని కేరళ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. భూమిపై మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌లో భారీ క్రేటర్‌ను గుర్తించడం ఇదే తొలిసారని పరిశోధనా బృందం వెల్లడించింది. జియాలజిస్టుల బృందం కచ్‌లోని కేటర్‌ సైట్‌ నుంచి లభించిన రాళ్లను విశ్లేషించగా.. ఆ రాళ్లు ఉల్కలోని భాగమేనని పరిశోధనలో వెల్లడైంది. ఈ ఉల్క సుమారు 6900 సంవత్సరాల కిందట భూమిని ఢీకొట్టిందని, సమయంలో నాగరికత కూడా విలసిల్లేదని పరిశోధకులు భావిస్తున్నారు. సింధులోయ నాగరికత ప్రపంచంలోని పునారత నాగరికతల్లో ఒకటి. నేచర్ మ్యాగజైన్‌లో పరిశోధనా కథనం ప్రచురితమైంది. సింధు లోయ నాగరికత కనీసం 8వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం సింధు లోయ నాగరికత గురించి మెరుగైన సమాచారం పొందవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉల్క దాదాపు 6,900 సంవత్సరాల కిందట భూమిని ఢీకొట్టిందని ప్రస్తుతం చెప్పగలమని.. అయితే, ఖచ్చితమైన తేదీతో పాటు దాని ప్రభావం ఎలా ఉందనేది ఇంకా గుర్తించలేదని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన జియాలజిస్ట్‌ కేఎస్‌ సజిన్‌కుమార్‌ పేర్కొన్నారు. గుజరాత్‌ కచ్‌లోని క్రేటర్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పాలని ప్రధాని మోదీకి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో గుర్తించిన నాల్గో క్రేటర్‌ కాగా.. భారత బృందం కనుగొన్న తొలి క్రేటర్‌ ఇదే. అంతకు ముందు మూడు క్రేటర్లను విదేశీ శాస్త్రవేత్తలు గుర్తించారు. సింధు లోయ నాగరికత ఉన్న ప్రాంతానికి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్రేటర్‌ ఉన్నది. అయితే, ఉల్క భూమిని ఢీకొట్టడం వల్లే సింధు నాగరికత అంతమైందా..? దానికి మరేమైనా కారణం ఉందా? అనేదిపై శాస్త్రవేత్తలను అయోమయానికి గురి చేస్తున్నది. క్రేటర్‌ దాదాపు రెండు కిలోమీటర్ల వెడెల్పు ఉంది. దాదాపు 100-200 మీటర్ల వెడెల్పు ఉన్న ఉల్క కారణంగా విశాలమైన క్రేటర్‌ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉల్క ఢీకొట్టిన సమయంలో క్రేటర్‌ నుంచి వెలువడిన దుమ్ము తొలగేందుకు దాదాపు నెల రోజుల వరకు సమయం పట్టి ఉండవచ్చని పేర్కొంటున్నారు. కేరళ శాస్త్రవేత్తల పరిశోధన సైన్స్‌ డైరెక్ట్‌ అనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తల సహకారంతో ఉల్క భూమిని ఎప్పుడు ఢీకొట్టిందో కచ్చితమైన సమయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్రేటర్ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సజిన్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం చిత్తడి నేలగా మారిందని.. క్రమక్రమంగా నాశనమవుతోందని సంవత్సరంలో 11 నెలలు నీటితో నిండి ఉంటుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu