Ad Code

ఇండియన్ రైల్వే బైక్ పార్శిల్ సర్వీస్ !


భారతీయ రైల్వే బైక్ పార్శిల్ సర్వీస్ దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తుంది, కాబట్టి రైల్వే స్టేషన్ ఉన్న ఏ ప్రదేశానికైనా బైక్‌ను పంపవచ్చు. అయితే, డోర్ డెలివరీ ఆప్షన్ లేదు. బైక్‌ను స్టేషన్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. మోటార్ సైకిల్‌ను ఒక నగరం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయడానికి రైల్వేస్ చౌకైన, సురక్షితమైన సర్వీస్ అందిస్తోంది. అదే ఇండియన్ రైల్వే బైక్ పార్శిల్ సర్వీస్. ఇండియన్ రైల్వేస్ బైక్ పార్శిల్ సర్వీస్‌తో బైక్‌ను రైలులో లగేజీగా లేదా పార్శిల్‌గా మరొక సిటీకి రప్పించుకోవచ్చు. ఈ సర్వీస్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బైక్ దూరం, బరువు ప్రకారం డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. లగేజీగా బైక్‌ను ట్రైన్ ఎక్కించాక దానిని ట్రాక్ చేసే సదుపాయం కూడా ఉంటుంది, దాని స్టేటస్‌ అప్‌డేట్స్‌ కూడా ఎప్పటికప్పుడు పొందవచ్చు. సమీపంలోని రైల్వే పార్శిల్ బుకింగ్ స్టేషన్‌కి వెళ్లి ఇందుకు సంబంధిత ఫారమ్‌ నింపి రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి. బైక్ బరువు ఆధారంగా ఫీజు చెల్లించి, రైల్వే రిసిప్ట్  తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకున్నాక గమ్యస్థానంలో బైక్‌ను కలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ అయితే ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఐఆర్సిటీసీ అకౌంట్‌తో లాగిన్ అయి  పార్శిల్ బుకింగ్ పోర్టల్‌కి వెళ్లి రైలును ఎంచుకుని, బైక్ బరువును ఎంటర్ చేయాలి. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, రైల్వే రిసిప్ట్ పొందాలి. రైల్వే రిసిప్ట్‌తో బైక్‌ను ట్రాక్ చేయవచ్చు. ఫీజు బైక్ వెళ్లాల్సిన దూరం, బరువుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 500 కి.మీ వరకు బైక్‌ను పంపేందుకు ఫీజు రూ.1,200, కానీ అది మారవచ్చు. స్టాండర్డ్ ప్రైస్‌లు చూస్తే 500 కి.మీ దూరం వరకు ఛార్జీలు రూ.1,200. అయితే 500 కి.మీ పైగా దూరానికి ఛార్జీలు మారుతూ ఉంటాయి. బైక్‌కు సంబంధించిన ఆర్‌సీ బుక్, ఇన్సూరెన్స్ కాపీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్‌ దగ్గర ఉండాలి. అగ్ని ప్రమాదాలను నివారించడానికి నిబంధనల ప్రకారం, బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా ఎంప్టీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే, రూ.1,000 జరిమానా చెల్లించుకోక తప్పదు.




.

Post a Comment

0 Comments

Close Menu