Ad Code

వాట్సాప్ లో ఐఫోన్ టు ఐఫోన్ కూడా....?


వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. దీనిలో ఇప్పుడు ఒరిజనల్ మీడియా ఫైల్స్ ను పంపగలరు. WABetaInfo కథనం ప్రకారం ఈ ఫీచర్ సహాయంతో మీరు ఇతర ఐఫోన్ వినియోగదారులకు ఒరిజినల్ క్వాలిటీతో ఫోటోలు, వీడియోలను పంపగలరు. ఇప్పటి వరకు ఐఫోన్ నుంచి ఐఫోన్ కి పంపే ఫొటో లేదా ఫైల్ క్వాలిటీ పరంగా అసలు ఫైల్ కంటే తక్కువగా ఉంది. అయితే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ రోల్ అవుట్ తర్వాత ఐఫోన్ యూజర్లు వీడియోలు, ఫోటోల అసలు ఫైల్స్ ను పంపగలరు. వాట్సాప్ ఈ ఫీచర్ ను లాంచ్ అయిన తర్వాత ఫోటోలు, వీడియోలను డాక్యుమెంట్ల ద్వారా షేర్ చేయగలరు. దీని కారణంగా ఫోటోలు, వీడియోల నాణ్యత ప్రభావితం కాదు. దీన్ని ఉపయోగించడానికి, ముందుగా వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి. దీని తర్వాత ఛాట్ లో షేర్ బటన్ నొక్కాలి. తర్వాత అక్కడ డాక్యుమెంట్ ను ఎంచుకోవాలి. మీరు ఎక్కడ నుంచి అయినా ఫోటో లేదా వీడియోని ఎంచుకోగలరు. ప్రస్తుతం వాట్సాప్ లో ఐఫోన్ నుంచి ఫొటోలు, వీడియోలు డాక్యుమెంట్ ద్వారా పంపడం కూడా కష్టమే. దీని కోసం ముందుగా మీరు షేర్ చేయాలనుకున్న ఫొటో లేదా వీడియోను ఫైల్స్ లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ లో డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాటిని పెంచవచ్చు. కొంతకాలం క్రితం వాట్సాప్ తన వినియోగదారుల కోసం చాట్ లాక్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ ముఖ్యమైన చాట్లను హైడ్ చేయవచ్చు. సరళంగా చెప్పాలంటే, ఈ ఫీచర్ గోప్యతను బలోపేతం చేయడంలో సహాయపడింది. లాక్ చేయబడిన చాట్లను దాచడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్ను తీసుకువస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాట్సాప్ ప్రస్తుతం మరో కొత్త ఫీచర్పై కూడా పనిచేస్తోంది. ఇది చాట్లో యూజర్ ప్రొఫైల్ సమాచారాన్ని కనుగొనడంలో ఉపయోగపడుతుంది. అంటే ఆ ప్రొఫైల్లోని సమాచారాన్ని ఛాట్లో కాంటాక్ట్ వద్ద చూడవచ్చు. ప్రస్తుతానికి మొదట వాట్సాప్ ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే లాంచ్ చేయనుందని తెలుస్తోంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo కథనం ప్రకారం గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.25.11 అప్డేట్ ద్వారా కంపెనీ ఈ ఫీచర్ పై పని చేస్తున్నట్టు సమాచారం.  

Post a Comment

0 Comments

Close Menu