Ad Code

ఫోన్ హోమ్ స్క్రీన్‌ను అట్రాక్టివ్‌గా మార్చే యాప్స్ !


ఆండ్రాయిడ్ ఫోన్లలో వాల్‌పేపర్స్ చాలా తక్కువగా ఉంటాయి. అవి కూడా ఓల్డ్ ఆట్టిట్యూడ్‌ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అయితే కొత్త రకం వాల్‌పేపర్స్ కోరుకునే వారు కొన్ని వాల్‌పేపర్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి మీ ఫోన్ లేదా టాబ్లెట్ లుక్‌ను అట్రాక్టివ్‌గా మారుస్తాయి. హోమ్ స్క్రీన్‌ను అట్రాక్టివ్‌గా మార్చే యాప్స్ కొన్ని వున్నాయి. 

గూగుల్ వాల్‌పేపర్స్ : గూగుల్ వాల్‌పేపర్స్ యాప్ ఫ్రీగానే కొన్ని బెస్ట్ వాల్‌పేపర్స్ ఆఫర్ చేస్తుంది. ఇది గూగుల్ కంపెనీకి చెందిన అఫీషియల్ యాప్. యూజర్లు వివిధ రకాల టెక్చర్స్, ల్యాండ్‌స్కేప్స్, గూగుల్ ఆర్ట్స్, కల్చర్ వంటి కలెక్షన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వాల్‌పేపర్‌గా డివైజ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఎలాంటి యాడ్స్ ఉండవు.

పిక్స్ వాల్‌పేపర్స్ :పిక్స్ వాల్‌పేపర్స్ యాప్, గూగుల్ పిక్సెల్ వాల్‌పేపర్స్ నుంచి ప్రేరణ పొందిన ఇమేజెస్‌ను అందిస్తుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్, ఫంక్షనల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. బెస్ట్ వాల్‌పేపర్ కలెక్షన్స్ దీని సొంతం. ఏ డివైజ్‌లో అయినా లేటెస్ట్ పిక్సెల్ వాల్‌పేపర్స్ డౌన్‌లోన్ చేసుకోవచ్చు.

రెస్‌ప్లాష్ వాల్‌పేపర్స్:అన్‌స్ప్లాష్‌ అనే పోర్టల్ వివిధ రకాల ఇమేజెస్‌తో బెస్ట్ వాల్‌పేపర్స్ అందిస్తుంది. ఇది ప్రొపరైటరీ స్టాక్ ఫోటోగ్రఫీ ప్లాట్‌ఫామ్. చాలామంది యూజర్లకు దీని గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ పోర్టల్ నుంచి బెస్ట్ క్యూరేటెడ్ వాల్‌పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి రెస్‌ప్లాస్ వాల్‌పేపర్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాల్‌పేపర్స్‌ను సరైన టెక్చర్స్, లైటింగ్, అబ్‌స్ట్రాక్ట్, వాటర్, ఇతర కలెక్షన్స్‌ను వేరు చేసి అందిస్తుంది.

అబ్‌స్ట్రాక్ట్ :  వన్‌ప్లస్ డివైజ్‌ల్లో అందించిన వాల్‌పేపర్స్ మీకు నచ్చాయా? వీటి క్రియేటర్ 'హాంపస్ ఓల్సన్' పనితీరు అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ అబ్‌స్ట్రాక్ట్  యాప్‌ను అందిస్తోంది. ఎక్కువగా నైరూప్య కళకు చెందిన వాల్‌పేపర్స్ ఉంటాయి. యూజర్లు పెయిడ్ వాల్‌పేపర్స్‌తో పాటు ఫ్రీ కలెక్షన్ కూడా సొంతం చేసుకోవచ్చు.

బ్యాక్‌డ్రాప్స్ : బ్యాక్‌డ్రాప్స్ ఆల్-టైమ్ క్లాసిక్‌ యాప్‌గా నిలుస్తూ బెస్ట్ వాల్‌పేపర్స్‌ను ఫ్రీగా అందిస్తోంది. యూజర్లు కమ్యూనిటీ సెక్షన్ నుంచి వాల్‌పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ 'ఎక్స్‌ప్లోర్' ట్యాబ్ నుంచి సెలక్ట్ చేసుకుంటేనే, వాల్‌పేపర్‌ను నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో యాప్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఒరిజినల్ వాల్‌పేపర్స్ ఉంటాయి. అయితే యాప్ ప్రో వెర్షన్‌ను కొనుగోలు చేస్తే, ఈ ఈ పరిమితి ఉండదు.

Post a Comment

0 Comments

Close Menu