Ad Code

లిస్టా కొత్త స్మార్ట్‌ వాచ్‌ లు విడుదల !


దేశీయ మార్కెట్లోకి లిస్టా కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. 'SmartRist E' సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా SmartRist E-1, SmartRist E-2, SmartRist E-4 వేరియంట్స్‌లో వాచ్‌లను లాంచ్‌ చేశారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ఈ వాచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 1299గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే.. E-1, E-2 వాచ్‌లలో 2.01 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. 240 x 296 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ వాచ్‌ సొంతం. ఈ స్మార్ట్ వాచ్‌ను వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 15 రోజులు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది. ఇక వాచ్‌లపై ఫ్రేమ్‌ వాటర్‌ రెసిస్టెంట్ మెటాలిక్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో వాచ్‌తోనే నేరుగా కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌తో పాటు మైక్‌ను అందించారు. ఇక హెల్త్ కోసం Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, ఫిట్‌నెస్ మానిటరింగ్ వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu